Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షాంపూ, సబ్బుల సంస్థ 'డవ్'పై తీవ్ర దుమారం!

  • జాత్యహంకార పూరితంగా యాడ్
  • బాడీ వాష్ వాడితే నల్లజాతీయురాలు తెల్లగా మారిపోతుంది
  • మండిపడుతున్న నెటిజన్లు
షాంపూలు, సబ్బుల తయారీ సంస్థ డవ్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయితే, ఆ సంస్థపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది. ఫేస్ బుక్ లో డవ్ చేసిన ఓ యాడ్ దీనికి కారణం. ఓ నల్ల జాతీయురాలు తన షర్ట్ తీసేస్తే తెల్లటి మహిళగా మారిపోతుందంటూ డవ్ బాడీ వాష్ యాడ్ ను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసింది. ఈ యాడ్ జాత్యహంకారాన్ని చూపుతోందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నల్ల జాతీయురాలు తెల్ల జాతీయురాలిగా మారడం జాత్యహంకారమేనని వారు మండిపడుతున్నారు.

శుభ్రమైన శరీరం అంటే తెల్ల రంగు శరీరం కాదని అట్లాంటాకు చెందిన ఓ ప్రొఫెసర్ మండిపడ్డారు. నల్ల రంగు శరీరం చెత్త, తెల్ల రంగు శరీరం శుభ్రమైనదనే విధంగా ఈ యాడ్ ఉందని అన్నారు. తాను డవ్ ఉత్పత్తులను చాలా కాలంగా వాడుతున్నానని... ఇకపై వీటిని వాడబోనని ఆయన తెలిపారు. డవ్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి జాత్యహంకార ప్రకటనలు ఇంతకు ముందు చాలాసార్లు ప్రచురించింది. 
dove
dove body wash ad controversy

More Telugu News